నరబలి కోసం ఓ పదేళ్ల బాలికను అపహరించిన ఘటన కర్ణాటకలోని నేలమంగళలో జరిగింది. జూన్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సోలదేవనహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గాంధీ గ్రామ్కు చెందిన ఓ పదేళ్ల బాలిక ఇంటిముందు ఆడుకుంటూ ఉంది. ఐదుగురు దుండగులతో పాటు ఓ మంత్రగాడు.. ఆ బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అమ్మాయి కనిపించక పోవడం వల్ల తల్లిదండ్రులు ఊరంతా వెతికారు. ఆఖరికి ఓ వ్యవసాయ క్షేత్రంలో బాలికపై క్షుద్రపూజలు చేస్తుండగా కనిపెట్టారు. బాలికను ఇంటికి తీసుకొచ్చారు.