తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జడ్జి దిద్దిన కాపురాలు- పిల్లల సమక్షంలోనే మళ్లీ పెళ్లిళ్లు - కర్ణాటకలో లోక్​ అదాలత్​ ఫొటోలు

వేదమంత్రాలు, మంగళవాద్యాలు, బంధుగణం మధ్య అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కానీ.. పిల్లలు పుట్టిన తర్వాత కొన్నేళ్లకు మనస్పర్థలతో విడిపోవాలనుకున్నారు. అయితే విడాకుల కోసం ఎక్కడికైతే వెళ్లారో అక్కడే కలిసిపోయారు. దంపతుల మధ్య పెరిగిన అగాధాన్ని ఓ జిల్లా జడ్జి సునాయాసంగా పరిష్కరించిన తీరును మీరూ చూసేయండి..

lokadalat
lokadalat

By

Published : Aug 15, 2021, 4:33 PM IST

లోక్​ అదాలత్​తో ఒక్కటైన జంటలు

సాఫీగా సాగిపోతున్న జీవితంలో చిన్న చిన్న కారణాలతో కలత చెందిన కొందరు దంపతులు విడాకులు తీసుకోవాలనున్నారు. పిల్లల భవిష్యత్​ గురించి ఆలోచించకుండా.. వారి పంతాలతో కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారు. అయితే విడాకుల కోసం వారు ఆశ్రయించిన న్యాయస్థానమే వారిని కలిపింది. కర్ణాటకలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

క్షణికావేశంలోనే..

గదగ్ జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ జరిగింది. దీనిలో ఐదు జంటల విడాకుల కేసులు పరిష్కారమయ్యాయి. చిన్నచిన్న కారణాలతో తలెత్తిన మనస్పర్థల వల్ల గొడవపడి దూరంగా ఉంటున్న వీరందరికీ జిల్లా జడ్జి మహాలక్ష్మి కౌన్సిలింగ్ ఇచ్చారు. దంపతుల మధ్య సమస్యలకు విడాకులు మాత్రమే పరిష్కారం కాదని సూచించారు. వారు తిరిగి కలిసి జీవించేలా ఒప్పించారు. దీనితో ఈ ఐదు జంటలు తిరిగి కలిసిసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి.

జంటలకు కౌన్సిలింగ్ ఇస్తున్న జిల్లా జడ్జి
కోర్టులో సందడి వాతావరణం

కోర్టులో సందడి..

ఒక్కటైన జంటలు దండలు మార్చుకుని, స్వీట్లు తినిపించుకున్నాయి. ఈ వ్యవహారంతో జిల్లా కోర్టులో సందడి వాతావరణం నెలకొంది. ఈ దృశ్యాన్ని చూసి ఇన్నాళ్లూ తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయిన పిల్లలు ఎంతో ఆనందించారు. తమ అమ్మ, నాన్నను కలిపినందుకు కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

లోక్​అదాలత్​లో పెళ్లైన ఓ జంట కుమారుడు
పెళ్లైన జంటలు
చిన్నారిని ఎత్తుకుని పెళ్లి చేసుకున్న జంట

విడాకుల కోసం వచ్చిన 'ఐదు' జంటలను తిరిగి కలపడం ఇదే మొదటిసారని న్యాయవర్గాలు తెలిపాయి. విడాకులతో ఎదురయ్యే అనర్థాలను ఈ జంటలకు అర్థమయ్యేలా వివరించినట్లు పేర్కొన్నాయి.

పిల్లల ముందు తిరిగి వివాహం చేసుకున్న ఆ జంటలు ఇలా కలవడం తమ జీవితంలో అరుదైన క్షణాలని చెప్పుకొచ్చాయి.

లోక్​ అదాలత్​ కార్యక్రమంలో ఇలానే మరో 4000 కేసుల్లో రాజీ కుదిరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details