10th Class Student Teaches Civil Services Aspirants: చదివేది పదోతరగతే.. కానీ చేసే పని మాత్రం పాఠాలు చెప్పడం! అది కూడా స్కూల్ పిల్లలకు కాదు.. ఏకంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, లా స్టూటెండ్స్కు క్లాస్లులు చెబుతున్నాడు ఈ బాలుడు. అతడి ప్రతిభను చూసి.. సీఎం, గవర్నర్లు, కేంద్రమంత్రులు సైతం మెచ్చుకోలేక ఉండలేకపోయారు మరీ. ఆ పిల్లాడే ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన యశ్వర్ధన్ సింగ్.
సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు హిస్టరీ, పొలిటీ, ఇంటర్నెషనల్ రిలేషన్స్, జాగ్రఫీని చెబుతున్నాడు. అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ టాపిక్స్ బోధిస్తున్న వ్యక్తిగా లండన్‌కు చెందిన హార్వర్డ్ రికార్డ్స్‌లో పేరు సంపాదించాడు. అలానే ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా అతడి పేరు మీద పోస్టల్ స్టాంప్స్‌ను కూడా విడుదల చేశారు.
ఇంత చిన్న వయస్సులోనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మార్గనిర్దేశం ఇవ్వటం, యువ ప్రొఫెసర్‌గా పేరు తెచ్చుకోవడానికి తన తల్లి కారణం అని అంటున్నాడు యశ్వర్ధన్ సింగ్. "మా అమ్మ కంచన్ పాల్ ఇంట్లో.. ఉత్తర్‌ప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యేవారు. ఏం చేస్తున్నావు? ఏం చదువుతున్నావు? అని ఆమెను అడిగేవాడిని. అమ్మ చెప్పిన మాటలకు నాకు కూడా ఆసక్తి పెరిగింది. అమ్మ చదువుకునేటప్పుడు పాలిటీ, హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి అనే అడిగి తెలుసుకున్నాను. నేను కూడా అప్పటి నుంచి చదవటం ప్రారంభించాను" అని యశ్వర్ధన్ సింగ్ తెలిపాడు.
అంతర్జాతీయ సదస్సులో భారత్ తరపున ప్రతినిధ్యం.. విద్యా రంగానికి సంబంధించి దిల్లీలో 'గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో నావిగేట్ ఎడ్యుకేషన్' జరిగిన అంతర్జాతీయ సదస్సుకు భారత్ తరపున నాయకత్వం వహించాడు యశ్వర్ధన్ సింగ్. బాల్య విద్యా సంరక్షణ అంశంపై ప్రసంగించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ అంతర్జాతీయ సదస్సుకు 30 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. యశ్వర్ధన్ సింగ్ ప్రతిభను చూసి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను పిలిచి మరీ మట్లాడారు.