కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉచిత టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టాలని కేంద్రాన్ని కోరాయి 13 విపక్ష పార్టీలు. కరోనా రోగులతో నిండిపోయిన ఆసుపత్రులు, ఆరోగ్య శిబిరాలకు అంతరాయం లేకుండా ఆక్సిజన్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు 13 పార్టీల నేతలు సంయుక్త ప్రకటన చేశారు.
" కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉచిత టీకా పంపిణీ చేపట్టాలని కోరుతున్నాం. రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులకు ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా చూడాలి. బడ్జెట్లో కేటాయించిన రూ.35వేల కోట్లు నిధులను వ్యాక్సినేషన్ కోసం తప్పనిసరిగా ఉపయోగించాలి. "