తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సుప్రీంకోర్టు ఆంతరంగిక ప్రక్రియ అత్యంత రహస్యం' - భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే

సుప్రీంకోర్టులో అంతర్గత వ్యవహారాలు అత్యంత గోప్యంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. జడ్జీలకు వ్యతిరేకంగా వచ్చిన నిందపూరితమైన ఫిర్యాదులకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే చర్యలు తీసుకొనే అవకాశం ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వర్గాలే వెల్లడించాయని పేర్కొంటూ మీడియాలో వచ్చిన వార్తా కథనాలను తోసిపుచ్చింది.

"In house procedure confidential:" Supreme Court refutes media reports on action against sitting judge
'సుప్రీంకోర్టు ఆంతరంగిక ప్రక్రియ అత్యంత రహస్యం'

By

Published : Jan 8, 2021, 7:13 AM IST

సర్వోన్నత న్యాయస్థానంలో అంతర్గత వ్యవహారాలు అత్యంత గోప్యంగా ఉంటాయని, వాటి సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం కాబోదని సుప్రీంకోర్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. జడ్జీలకు వ్యతిరేకంగా వచ్చిన నిందపూరితమైన ఫిర్యాదులకు సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే చర్యలు తీసుకొనే అవకాశం ఉందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వర్గాలే వెల్లడించాయని పేర్కొంటూ మీడియాలో వచ్చిన వార్తా కథనాలను తోసిపుచ్చింది. ఆ కథనాలకు విశ్వసనీయతను ఆపాదించుకోవటానికి 'సుప్రీంకోర్టును ఉటంకించార'ని తెలిపింది.

న్యాయస్థానంలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలన్నీ స్వతహాగానే అత్యంత రహస్యంగా ఉంటాయి. అటువంటి సమాచారాన్ని మీడియాకు వెల్లడించడం అనేది ఎట్టిపరిస్థితుల్లోనూ జరగదు.

-- సుప్రీంకోర్టు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, జస్టిస్‌ బోబ్డే ఆ జడ్జీ నుంచి వివరణ కోరారంటూ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి.

ఇదీ చదవండి :'దేవుడి' యాడ్స్​పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details