తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సింహాన్ని 'సెల్ఫీ గ్యాంగ్​' రౌండప్ చేస్తే... - జునాగఢ్​

సెల్ఫీల కోసం వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించిన ఘటన గుజరాత్​ గిర్​ అడవుల్లో జరిగింది. అటవీ ప్రాంతంలో ఓ సింహం కనపడగా.. దానితో సెల్ఫీలు దిగేందుకు పర్యటకులు ఎగబడ్డారు. సింహానికి కొన్ని మీటర్ల దూరంలో నిలబడి ఫొటోలు తీసుకున్నారు. ఇలా దాదాపు ఆరు వాహనాల్లో ప్రజలు సింహాన్ని చుట్టుముట్టారు. పర్యటకులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

arat : A Photo violating of the Wildlife Ac
సెల్ఫీ గ్యాంగ్​ వైరల్​ ఫొటో

By

Published : Nov 18, 2021, 4:35 PM IST

గుజరాత్ జునాగఢ్​లోని గిర్​ అడవులకు చెందిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఫొటోలో ఓ సింహం రోడ్డు మధ్యలో కూర్చుని ఉండగా.. పర్యటకులు దానితో సెల్ఫీ దిగేందుకు ఎగబడ్డారు. సింహానికి కొన్ని మీటర్ల దూరంలో, వాహనాల్లో నిలబడి ఫొటోలు దిగారు. ఏకకాలంలో దాదాపు ఆరు వాహనాలు ఆ సింహాన్ని చుట్టుముట్టాయి.

ఈ ఫొటోను దిల్లీకి చెందిన గ్రీన్​ సర్కిల్​ అనే ఎన్​జీఓ ట్వీట్​ చేసింది. ఆ ట్వీట్​ను జునాగఢ్​​కు చెందిన మాజీ జడ్జి జయదేవ్​ ధధల్​ రీట్వీట్​ చేస్తూ.. పర్యటకులపై విరుచుకుపడ్డారు. పర్యటకులు వన్యప్రాణుల చట్టాన్ని ఉల్లంఘించారని, వారిపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, వాహనాలు నడిపిన డ్రైవర్లను విడిచిపెట్టకూడదని సూచించారు.

సెల్ఫీ గ్యాంగ్​ వైరల్​ ఫొటో

ఈ వ్యవహారంపై ససన్​ గిర్​ డిప్యూటీ ఫారెస్ట్​ కన్జర్వేటర్​ మోహన్​ రామ్​ను ఈటీవీ భారత్​ సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ ఎటువంటి స్పందన లభించలేదు.

ఇదీ చూడండి:-జంతు సంరక్షణ మానవాళికి రక్షాకవచం

ABOUT THE AUTHOR

...view details