ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడానికి టీవీలలో.. పేపర్లలో ప్రకటనలు ఇస్తారు. ఇంకా ఇంటింటికెళ్లి ప్రచారం కూడా చేస్తారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతారు. కానీ బంగాల్ హౌడాలోని స్వీటు షాపు యాజమాని ఓటు హక్కు వినియోగంపై వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
బంగాల్లో మోదీ, దీదీ 'స్వీటు' విగ్రహాలు
ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పడానికి బంగాల్లోని ఓ స్వీటు షాపు యజమాని వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. స్వీట్లతో ప్రధాని నరేంద్ర మోదీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సహా ప్రముఖ నాయకుల విగ్రహాలను తయారు చేసి ఓటింగ్లో పాల్గొనవలసిందిగా ప్రజల్నికోరుతున్నారు.
ప్రధాని మోదీ, మమత బెనర్జీ
బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, సంయుక్త కూటమి నేతల స్వీటు విగ్రహాలను తయారు చేసి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు షాపు యజమాని. అంతేకాకుండా పార్టీ గుర్తులతో స్వీట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రచారానికి స్వీట్ల కంటే ఇంకేం చేరువవుతాయని ఆయన అన్నారు.
ఇదీ చదవండి:మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం!
Last Updated : Apr 3, 2021, 9:56 AM IST