తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాసేపట్లో పెళ్లి.. సినీ ఫక్కీలో వధువును ఎత్తుకెళ్లిన పోలీసులు.. చివరకు.. - వధువును ఎత్తుకెళ్లిన పోలీసులు

మరి కాసేపట్లో తాళి కడుతడానగా.. వరుడి కళ్లముందే వధువును తీసుకెళ్లారు పోలీసులు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. మహారాష్ట్రలో జరిగిన మరో ఘటనలో ఓ యువతి.. బాయ్​ఫ్రెండ్​తో పారిపోయేందుకు తనను ఎవరో కిడ్నాప్ చేసినట్లు కట్టుకథ అల్లింది.

police drags away bride minutes before wedding
police drags away bride minutes before wedding

By

Published : Jun 19, 2023, 1:40 PM IST

Updated : Jun 19, 2023, 3:42 PM IST

కాసేపట్లో పెళ్లి.. సినీ ఫక్కీలో వధువును ఎత్తుకెళ్లిన పోలీసులు

పెళ్లికి అంతా సిద్ధమైంది. వధూవరులు పెళ్లి పీటలెక్కారు. మరి కాసేపట్లో పెళ్లికుమార్తె మెడలో వరుడు తాళి కడతాడనగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆపండీ.. అంటూ పెద్ద అరుపు.. ఇదేదో తెలుగు సినిమాలో సన్నివేశం అనుకుంటున్నారా! కాదండీ.. కేరళ తిరువనంతపురంలోని కోవలంలో జరిగిన ఓ ఘటన. ఓ గుడిలో మతాంతర వివాహం చేసుకుంటున్న జంటను పోలీసులు వచ్చి విడదీశారు. వరుడి ముందే వధువును తీసుకెళ్లారు.

ఇదీ జరిగింది
కాయంకులంకు చెందిన అఫ్రిన్​.. అఖిల్ అనే యువకుడిని పెళ్లిచేసుకోవాలని నిశ్చయించుకుంది. ఇందుకోసం అఖిల్​తో కలిసి కోవలం వచ్చేసి.. ఓ గుడిలో పెళ్లి చేసుకుంటోంది. మరోవైపు తమ కుమార్తె తప్పిపోయిందంటూ యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కోవలంలో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లి యువతిని బలవంతంగా తీసుకువచ్చారు. తన ఇష్టంతోనే ఇక్కడికి వచ్చానని చెప్పినా.. వినకుండా ఓ ప్రైవేట్ వాహనంలో ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. తాను అఖిల్​తో ఇష్టపూర్వకంగానే వచ్చానని.. తననెవరూ కిడ్నాప్​ చేయలేదని వాంగ్మూలం ఇచ్చింది. దీంతో అఖిల్​తో వెళ్లేందుకు కోర్టు అంగీకరించింది.

"అలప్పుజ జిల్లాలోని కాయంకులంలో యువతి తప్పిపోయిందని మిస్సింగ్ కంప్లైంట్​ వచ్చింది. దీంతో ఆమెను వెతికి పట్టుకువచ్చి కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించారు. పోలీసుల డ్యూటీ వారు చేశారు. వరుడు అఖిల్​తో వెళ్తానని ఆమె స్టేట్​మెంట్​ ఇచ్చిన తర్వాత అతడితో పంపించేశాం. ఇందులో ఎక్కడా బలవంతం చేయలేదు."

--పోలీసులు

మరోవైపు అఫ్రిన్​ మాత్రం.. తనకు అఖిల్​తో వెళ్లడం ఇష్టమేనని కొద్ది రోజుల క్రితం స్టేట్​మెంట్​ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పింది. అఖిల్​తో వెళ్లడం ఇష్టంలేకే తన తల్లిదండ్రులు కేసు పెట్టారని తెలిపింది. అఫ్రిన్​ను తీసుకెళ్లాక కనీసం ఆమెను కలవడానికి సైతం అనుమతించలేదని వరుడు అఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పాడు. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు.

బాయ్​ఫ్రెండ్​తో వెళ్లేందుకు కిడ్నాప్ ప్లాన్​
మహారాష్ట్ర పాల్ఘర్​కు చెందిన ఓ యువతి.. బాయ్​ఫ్రెండ్​తో పారిపోయేందుకు తనను ఎవరో కిడ్నాప్ చేసినట్లు కట్టుకథ అల్లింది. విహార్​నగర్​కు చెందిన ఓ యువతి ఓ కంపెనీలో పనిచేస్తోంది. రోజులాగే శుక్రవారం పనికి వెళ్లిన యువతి.. సాయంత్రం తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది వెతకడం ప్రారంభించారు. ఇంతలోనే తనను కిడ్నాప్ చేసినట్లు సోదరుడికి వాట్సాప్​లో వాయిస్​ మెసేజ్ చేసింది యువతి. దీంతో భయపడిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. యువతి.. తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి కోల్​కతాకు వెళ్లినట్లు తేలింది. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు బృందం కోల్​కతాకు బయలుదేరింది.

Last Updated : Jun 19, 2023, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details