తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటవీ ప్రాంతంలో మూర్చపోయిన ఏనుగులు.. కారణమేంటి? - బిహార్​పుర్ అటవీ ప్రాంతంలో మూర్చపోయిన ఏనుగులు

ఏనుగులు మూర్చపోయి పడిపోయిన ఘటన ఛత్తీస్​గఢ్​లో కలకలం రేపింది. సూరజ్​పుర్​ జిల్లాలోని బిహార్​పుర్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

seven elephants fainted in chhattisgarh
ఛత్తీస్​గఢ్​లో ఏనుగులు మూర్చపోయిన వార్త

By

Published : Nov 22, 2021, 8:55 PM IST

బిహార్​పుర్ అటవీ ప్రాంతంలో మూర్చపోయిన ఏనుగులు

ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​ జిల్లాలోని బిహార్​పుర్ అటవీ ప్రాంతంలో ఏడు ఏనుగులు మూర్చపోయాయి. క్రిమిసంహారకాలు తాగడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న డాక్టర్లు చికిత్స అందించారు.

అయితే.. నాలుగు ఏనుగులు.. కోలుకుని తిరిగి అడవి వైపు వెళ్లిపోయాయని అధికారులు తెలిపారు. మరో మూడు ఏనుగులకు చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు.

కాగా.. బిహార్​పుర్ అటవీ ప్రాంతంలో దాదాపు 30 ఏనుగుల గుంపు సంచరిస్తోంది. స్థానిక గ్రామాల్లో పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. గ్రామాలపైకి వచ్చి ఇళ్లను కూల్చేస్తున్నాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవుల్లోకి పంపడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి:వీడియోకు పోజులిస్తుండగా.. రైలు ఢీకొని యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details