తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇదేనా మీరు వారికి చేసే న్యాయం? : రాహుల్​ - నరేంద్రమోదీ ప్రభుత్వం

నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్​, భాజపా విధానాల వల్ల దేశంలోని దళితులు, ఆదివాసీలకు విద్య దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. 60 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు కేంద్రం స్కాలర్​షిప్​ నిలిపివేందని ఓ మీడియా కథనాన్ని ఆధారంగా చూపారు రాహుల్​.

In BJP-RSS vision of India, Adivasis and Dalits should not have access to education: Rahul
ఇదేనా మీరు వారికి చేసే న్యాయం: రాహుల్​

By

Published : Nov 29, 2020, 12:49 PM IST

భాజపా, ఆరెస్సెస్​ విధానాల ఫలితంగా దేశంలోని ఆదివాసీలు, దళితులకు విద్య అందకుండా పోతోందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకారవేతనాన్ని నిలిపివేసి వారికి న్యాయం చేకూర్చుతారా? అని ట్విట్టర్​ వేదికగా ప్రశ్నించారు. ఈ మేరకు ఓ మీడియా కథనాన్ని తన ట్వీట్​కు జత చేశారు.

"భాజపా, ఆరెస్సెస్​ విధానాల వల్ల ఆదివాసీలు, దళితులు విద్యకు దూరమవుతున్నారు. ఉపకార వేతనాల్ని నిలిపివేయడమేనా మీరు వారికి చేసే న్యాయం?"

--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత.

రాహుల్​ జత చేసిన కథనంలో.. 11,12 తరగతులకు చెందిన 60 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల కోసం నిర్దేశించిన కేంద్ర ప్రభత్వ ఉపకార వేతన పథకం.. 14 రాష్ట్రాల్లో నిలిచిపోయినట్లుగా ఉంది.

ఇదీ చూడండి:ఉత్తర్​ప్రదేశ్​లో తొలి 'లవ్​ జిహాద్' కేసు

ABOUT THE AUTHOR

...view details