నిజాయితీగా సేవలందించిన ఓ హోం గార్డుకు తగిన గుర్తింపునిచ్చింది అసోం ప్రభుత్వం. రూ.12 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సాహసించి స్వాధీనం చేసుకున్న జవాను బోర్సింగ్ బేను రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్‌గా నియమించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. ఆయనకు స్వయంగా నియామక పత్రాన్ని అందజేశారు.
ఏం జరిగిందంటే..
కొద్ది రోజుల క్రితం.. మణిపుర్‌లోని ఇంఫాల్ నుంచి గువాహటికి రాత్రి వేళ వస్తున్న బస్సులో ఒంటరిగా సోదా చేశారు బోర్సింగ్. అందులో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో లంచం ఇవ్వజూపినా.. ఆయన ఆశ పడలేదు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. బోర్సింగ్కు పదోన్నతి కల్పించారు.