Punjab Bank Robbery: పంజాబ్ అమృత్సర్లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి దూరి రూ.6 లక్షలు దోచుకెళ్లారు. అందరూ చూస్తుండగానే సినీ ఫక్కీలో చోరీ చేశారు. అనంతరం దర్జాగా తెల్ల కారులో పరారయ్యారు. నలుగురు యువకులు అమృతసర్ సెంట్రల్ బ్యాంకులోకి కస్టమర్లలా ప్రవేశించారని బ్యాంకు అధికారులు చెప్పారు. అనంతరం నగదు చోరీ చేసి కారులో పారిపోయారని వెల్లడించారు.
పట్టపగలే బ్యాంకు దోపిడీ.. కస్టమర్లలా వచ్చి రూ.లక్షలు లూటీ - పంజాబ్ బ్యాంకు దోపిడీ
పంజాబ్లోని సెంట్రల్ బ్యాంకులో సినీఫక్కీలో చోరీ చేశారు దొంగలు. పట్టపగలే బ్యాంకులోకి ప్రవేశించి రూ.లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
Amritsar bank looty: ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన బ్యాంకుకు చేరుకున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి వెంటనే దర్యాప్తు చేపట్టారు. స్వయంగా కమిషనర్ కేసును పర్యవేక్షిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, అన్ని సీసీటీవీలను పరిశీలిస్తున్నాని ఆయన చెప్పారు. పంజాబ్లో ఇటీవలి కాలంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. నిందితులను త్వరగా పట్టుకునే విషయంలో పోలీసుల విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి:డబ్ల్యూహెచ్ఓ నివేదికపై రాజకీయ దుమారం.. తప్పుపట్టిన 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు