ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ జిల్లా కేంద్రీ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇంట్లో అలికిడి లేకపోవడం వల్ల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇవి హత్యలా? ఆత్మహత్యలా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పంచనామాకు తరలించారు.
ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు మృతదేహాలు - 5 members of same family dead
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. దీనిపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి.. కేసును వెంటనే దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి ...కారణాలేంటీ ?
ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి తామ్రద్వాజ్ సాహూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణానికి గల కారణాలేంటో తెలుసుకోమని పోలీసులను ఆదేశించారు.