రాజ్యసభ సభ్యుల నేతృత్వంలోని ఎనిమిది పార్లమెంటరీ స్థాయీ సంఘాలు 2019-20లో వాటి పనితీరులో గణనీయమైన మెరుగుదల నమోదు చేశాయి. గత మూడేళ్లలో అత్యుత్తమ పనితీరును కనబరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో సగటు సమావేశ వ్యవధి 2 గంటల 10 నిమిషాలుగా ఉందని, గతంలో ఉన్న 2 గంటల మార్క్‌ను తొలిసారి అధిగమించినట్లు తెలిపారు. 2018-19తో పోలిస్తే 55 శాతం మెరుగుదల నమోదైనట్లు పేర్కొన్నారు. 2017-18లో సగటు వ్యవధి ఒక గంట 51 నిమిషాలు కాగా.. 2018-19లో ఒక గంట 25 నిమిషాలుగా ఉంది.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశాల మేరకు గత మూడేళ్లో రాజ్యసభ కమిటీల పనితీరుపై అంచనా వేసింది పార్లమెంట్ సచివాలయం.
మూడేళ్లలో అత్యుత్తమం..
2019-20 కాలంలో మొత్తం 117 సమావేశాలు నిర్వహించాయి ఈ ఎనిమిది కమిటీలు. సభ్యుల హాజరు శాతం 49.20 శాతంగా ఉంది. గత మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యుత్తమం కావటం గమనార్హం. తొలి అర్ధభాగంలో చూసుకుంటే 2019-20లో 50.73 శాతం హాజరుతో రికార్డు నెలకొల్పాయని అధికారులు తెలిపారు. అయితే.. కరోనా మహమ్మారి కారణంగా రెండో అర్ధబాగంలో సభ్యుల హాజరు శాతం 41.15 శాతానికి తగ్గినట్లు వెల్లడించారు. ఓవైపు కరోనా ఉన్నప్పటికీ కమిటీలో సగటు సమావేశ వ్యవధి 2 గంటల 23 నిమిషాలుగా చెప్పారు.
2019-20లో 50శాతం అంతకన్నా ఎక్కువ మంది సభ్యులు హాజరైన సమావేశాలు 46.15 శాతం పెరిగాయి. గత రెండేళ్లలో అది 14.30 శాతంగా ఉండేది. కమిటీల పూర్తిస్థాయి కోరం లేకుండా సమావేశాలు నిర్వహించిన సందర్భాలు 10 శాతానికి పడిపోయాయి. గత మూడేళ్లలో ఇదే అత్యల్పం కావటం విశేషం.
మూడేళ్లలో 300 సమావేశాలు..