తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు.. చూసేందుకు భారీగా వస్తున్న రైతులు.. స్పెషల్ ఏంటంటే?

ఓ వ్యవసాయ ప్రదర్శన శాలలో ఉంచిన గజేంద్ర అనే దున్నపోతు రైతులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని బరువు 1500 కిలోలు ఉంటుంది. రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుంది. దీన్ని చూసేందుకు రైతులు ఎగబడుతున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనలో దీన్ని ఉంచారు. దాని ప్రత్యేకతలు తెలుసుకుందామా..!

impressive-gajendra-buffaloin-agricultural-exhibition-hall-in-maharashtra
వ్యవసాయ ప్రదర్శన శాలలో ఆకట్టుకుంటున్న గేదె

By

Published : Jan 28, 2023, 6:30 PM IST

Updated : Jan 29, 2023, 6:59 AM IST

కర్ణాటక రైతుకు చెందిన ఓ దున్నపోతు అందరిని ఆకట్టుకుంటోంది. దాని బరువు, తినే తిండి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మహారాష్ట్రలో జరుగుతున్న ఓ వ్యవసాయ ప్రదర్శనలో దీన్ని ఉంచగా.. రైతులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంతకీ ఈ దున్నపోతు ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈ దున్నపోతు పేరు గజేంద్ర. 1500 కిలోలు బరువున్న ఈ దున్నపోతు.. రోజుకు 15 లీటర్ల పాలు తాగుతుంది. కర్ణాటక బెళగావికి చెందిన రెడ్యాచే మాలక్​ అనే వ్యక్తి.. ఈ గజేంద్రకు యజమాని. మహారాష్ట్రలోని బీడ్​ జిల్లాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనకు దీన్ని తీసుకొచ్చాడు రెడ్యాచే. గజేంద్రను చూసేందుకు రైతులు ఎగబడుతున్నారు. దీని ధర దాదాపు 1.5 కోట్లు వరకు ఉంటుందని దాని యజమాని రెడ్యాచే చెబుతున్నాడు. ఈ దున్నపోతు ద్వారా ఆదాయం సైతం భారీగానే ఉందని చెప్తున్నాడు.

వ్యవసాయ ప్రదర్శన శాలలో ఆకట్టుకుంటున్న గేదె

"ఈ దున్నపోతును పంజాబ్​కు చెందిన కొందరు రైతులు రూ.1.5 కోట్లకు కొనేందుకు అడుగుతున్నారు. ఇది రోజు 15 లీటర్ల పాలతో పాటు.. రెండు కిలోల పిండి, 3 కిలోల గడ్డి తింటుంది. దీని నుంచి మాకు రోజుకు రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది. ఈ తరహా దున్నపోతులు మా దగ్గర ఐదు ఉన్నాయి. వీటి నుంచి మొత్తం రూ.10 వేలు వస్తాయి. మరో 50 గేదేలు ఉన్నాయి. ఇవి 100 నుంచి 150 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి నుంచి రోజుకు రూ. 50వేలు వస్తాయి."
-రెడ్యాచే మాలక్, దున్నపోతు యజమాని

ఎన్ని కోట్లు ఇచ్చినా తమ దున్నపోతులను విక్రయించేది లేదని రెడ్యాచే చెబుతున్నాడు. వాటిని తమ కుటుంబంలో ఒకటిగా చూసుకుంటున్నట్లు చెప్పాడు.
ఈ వ్యవసాయ ప్రదర్శన శాలను గత 15 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు. మహేశ్​ బెంద్రే అనే వ్యక్తి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. తన తండ్రి గణేశ్​ బెంద్రే జ్ఞాపకార్థం ఈ ప్రదర్శన శాలను నిర్వహిస్తున్నట్లు నిర్వహకుడు తెలిపాడు. ఇక్కడ రైతులకు ఉపయోగపడే వివిధ రకాల ఆధునిక వ్యవసాయ పరికరాలను ప్రదర్శనలో ఉంచినట్లు వెల్లడించాడు.

మహారాష్ట్ర రైతులకు సాంకేతికతను అందించే లక్ష్యంతో ఈ ప్రదర్శన శాలను ఏర్పాటు చేశాం. కిసాన్ కృషి ప్రతిస్థాన్ అనే సంస్థ తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా ఈ ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 180 స్టాల్​లను అందుబాటులో ఉంచాం. మధ్యప్రదేశ్​, హరియాణా, పంజాబ్​ ఇతర రాష్ట్రాల నుంచి రైతులు ఈ ప్రదర్శనకు వస్తున్నారు.
-మహేశ్​ బెంద్రే, ప్రదర్శన శాల నిర్వహకుడు

Last Updated : Jan 29, 2023, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details