బంగాల్లో కొందరు వ్యక్తులు హింసకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన చేతన్ మంజునాథ్ అనే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాశాడు. తక్షణమే బంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరాడు.
'టీఎంసీ వర్గాల హింసలో 30 మంది భాజపా కార్యకర్తలు మరణించారు. ఏడు వేల మంది హిందూ బాలికలపై లైంగిక దాడులు చేశారు. దీనికి సంబంధించి 15 వేల కేసులు నమోదయ్యాయి. హింస కారణంగా లక్ష మంది ప్రజలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయారు' అని చేతన్ లేఖలో పేర్కొన్నాడు.