యోగా ఒక జీవన విధానం. అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఒక మార్గం. భారత్లో ఆవిర్భవించిన యోగా.. ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది. దాదాపు 180 దేశాలల్లో యోగా సాధన చేస్తున్నారు. ఇంతటి మహత్తరమైన యోగాను.. ప్రతి ఒక్కరు తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని ఓ యువకుడు.. వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ.. యోగా ప్రయోజనాలను వివరిస్తున్నాడు.
కృష్ణ నాయర్ అనే యోగా టీచర్.. మైసూరు నుంచి పాదయాత్ర ఆరంభించాడు. గత ఆరు నెలలుగా కర్ణాటకతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో పర్యటించాడు. కొద్ది రోజుల క్రితం ఒడిశాలో పర్యటన ముగించి ప్రస్తుతం బాంగాల్లోని హుగ్లీలో కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయర్.. విద్యార్థినులకు కూడా యోగా, పర్యావరణ సంరక్షణ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. మనుషులు అనేక రోగాల బారిన పడుతున్నారని.. వాటిని ఎదుర్కొడానికి క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం అవసరం అని తెలిపాడు. దీంతో పాటు చెట్లు నాటడం కూడా ముఖ్యం అని చెబుతున్నాడు.
"నేను భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో పాదయాత్రలు చేశాను. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో పర్యటించాను. ఇప్పుటికీ దాదాపు ఆరు నెలలుగా పర్యటిస్తున్నాను. యోగా, పర్యావరణంపై కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ పాదయాత్ర లక్ష్యం."
-కృష్ణ నాయర్, యోగా టీచర్