భారత్లో 2 కోట్ల మందికి పైగా చిన్నారులు నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. అత్యధిక స్థాయిలో నీటి కొరత వీరిని పీడిస్తోందని, తాగు నీటి సంబంధ సేవలు చాలా పరిమితంగా అందుకుంటున్నారని తెలిపింది. నీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాలను ఈ అధ్యయనంలో గుర్తించారు.
2కోట్ల మంది చిన్నారులపై నీటి ఎద్దడి ప్రభావం - చిన్నారులపై నీటీ ఎద్దడి ప్రభావం
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్లో ఉండే చిన్నారులకు నీటి కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ముప్పు వీరిలో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.
ఇలాంటి చోట్ల ప్రజలకు ఉపరితల నీరు లేదా సేకరణకు అరగంటపైగా సమయం పట్టే నీటి వనరులే ఆధారం. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని కుటుంబాలు.. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై పెను ప్రభావం పడుతోంది.నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ముప్పు వీరికి అధికమని నివేదిక పేర్కొంది. సబ్బుతో చేతులు కడుక్కోవడం వంటి అలవాట్లకు వారు దూరమవుతున్నారని భారత్లో యునిసెఫ్ ప్రతినిధి యాస్మిన్ అలీ హేక్ చెప్పారు. సురక్షితమైన నీటి లభ్యతను పెంచాల్సిన అవసరాన్ని కొవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందని తెలిపారు.