Impact of Free Schemes on Economy ఉచిత హామీలు.. రాబోయే తరాలకు మోయలేని భారం Impact of Free Schemes on Economy : రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం. ఎన్ని రాజకీయాలు చేసినా పార్టీల అంతిమ లక్ష్యం గద్దెనెక్కి పాలించడమే. ఇందు కోసం ఎన్నికల సమయంలో అవి ప్రధానంగా నమ్ముకునేది హామీలను. ముఖ్యంగా ఉచిత హామీలపై ఇవి ఎక్కువగా ఆధారపడుతుంటాయి. పేర్లకు అతీతంగా దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలదీ ఇదే పరిస్థితి. ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్, ఇళ్ల పంపిణీ, మహిళలు, యువత వృద్ధులకు వరాలు.. ఇలా ఉచిత హామీల జాబితా చెప్పుకుంటే చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వడం ఎంత వరకు సబబు అనే చర్చ దేశంలో చాలా కాలంగానే ఉంది. అయితే కొంత వరకు ఫర్వాలేదు గాని, ఇబ్బడిముబ్బడిగా ఇచ్చే ఉచిత హామీల వల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వాలకు ఆర్థికంగా భారంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు తరచూ హెచ్చరిస్తూనే ఉన్నారు.
'ఓట్ల కోసం ఉచిత హామీలు దేశాభివృద్ధికి ప్రమాదకరం'
ఓ వైపు పన్నుల ఆదాయం తగ్గుతున్నా రాష్ట్రాలకు సబ్సిడీలు,ఉచితాలపై ఖర్చు పెరిగిపోతోందనిపేర్కొంది. ఆహారం, విద్య, వైద్యాలకు కాకుండా ఇతరాలకు ఇచ్చే సబ్సిడీలు, డిస్కమ్‌లకు బకాయిలు భారీగా పెరిగిపోయాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. 2020-21లో రాష్ట్రాల జీడీపీ-రుణాల జీడీపీ నిష్పత్తి చాలా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలు అత్యధిక రుణభారం మోస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలోని రాష్ట్రాలన్నింటి వ్యయభారంలో సగం ఈ 10 రాష్ట్రాలదే ఉన్నట్లు తేల్చింది.
Affect of Free Schemes in India :దేశంలో అత్యధిక రుణ భారం మోస్తున్న రాష్ట్రాలు 2020-21లో రుణ పరిమితి, విత్తలోటుకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన లక్ష్యాలను కూడా దాటిపోయాయి. వీటి మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం 80 నుంచి 90శాతానికి చేరింది. అంటే ఉత్పత్తిని పెంచే పెట్టుబడి వ్యయం తగ్గిపోయిందని అర్థం. పెట్టుబడి వ్యయం దీర్ఘకాలంలో ఉత్పత్తిని, ఉత్పాదకతను, వ్యాపారాలను పెంచుతుంది. రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే ప్రభుత్వాలకు వడ్డీల భారం పెరిగి, పన్నుల ఆదాయం తగ్గిపోతుంది.
'ఉచిత హామీలు తీవ్రమైన అంశం.. వాటిపై ఓ వైఖరి తీసుకోరెందుకు?'
దీర్ఘకాలంలో ఉత్పత్తి , ఉత్పాదకత పెరగడానికి దోహదం చేయని చెల్లింపులు అన్నీ ఉచితాలుగానే పరిగణించాలనిఅంటున్నారు. అయితే ఉచిత వరాలు ఎన్ని ప్రకటిస్తున్నా విద్య, వైద్య రంగాలపై భారత్ చేస్తున్న ఖర్చు నిరుపేద దేశాల కంటే కూడా తక్కువగా ఉంది. ప్రతి ఏటా అనేక రాష్ట్రాల బడ్జెట్ పరిమాణం పెరిగిపోతున్నా విద్య, వైద్య రంగాలు, మౌలిక వసతుల నిర్మాణంపై చేస్తున్న ఖర్చు తక్కువే. పన్నుల వ్యవస్థను హేతుబద్ధీకరించాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు అయ్యే అనుత్పాదక ప్రాజెక్టులకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు.
ఉచిత హామీల వల్ల ప్రభుత్వాలకు ఆర్థికంగా నష్టం అనే భావన ఉన్నా కొన్నింటి వల్ల మేలు కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ఉచిత విద్యుత్ వల్ల పేద రైతులు పంట కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న నిత్యావసర వస్తువులు పేదరికాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఇక మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం సహా పాఠశాలలకు హాజరును పెంచింది. ఇది కూడా ఉచిత పథకమే. అమలులో లోపాలు ఉన్నా ఇలాంటివి కొన్ని అనేక మందికి ప్రయోజనం కల్గించే పథకాలు.
ఎన్నికల్లో ఉచిత హామీలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు.. 7 రోజుల్లోగా!
Supreme Court On Free Schemes : ఎన్నికల ప్రక్రియలో ఇది అసమానమైన విధానానికి దారి తీస్తుందని పేర్కొంది. ఉచితాలు తీవ్రమైన వ్యవహారం అని, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఉచితాలను ప్రకటించడాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రభుత్వాన్ని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఉచితాలను రద్దు చేయడానికి ముందుకు రాదు కాబట్టి ఈ సమస్యపై పార్లమెంటులో సమర్థమైన చర్చ జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు 2022 ఆగస్టు 3న అభిప్రాయపడింది.
ఏ కోణంలో చూసినా కొన్నింటిని మినహాయిస్తే ఉచిత హామీలు భవిష్యత్ తరాలకు నష్టమే. ఆర్థికంగా మోయలేని భారానికి కారణమయ్యేవే. వీటిని నియంత్రించేందుకు ఏ చట్టమూ లేనందున రాజకీయ పార్టీలే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలే స్వీయ నియంత్రణను పాటించాలి. ఎన్నికల్లో గెలుపుతో పాటు ఉచితాల వల్ల తలెత్తబోయే ఆర్థిక ఉపద్రవం గురించి కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా ఉచితాల వైపు ఆకర్షితం కాకుండా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. తమ తర్వాతి తరాలకు జరగబోయే నష్టాన్ని బేరీజు వేసుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఉచిత హామీలకు కళ్లెం పడేది.
ఉచిత హామీలు ప్రయోజనమో.. కాదో ఓటర్లే నిర్ణయిస్తారు: ఈసీ