తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం- పాఠశాలలు బంద్​! - వర్షాలు

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు(tamil nadu rain today), కర్ణాటక(karnataka rain today), పుదుచ్చేరిలో భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

rainfall
భారీ వర్షాలకు స్తంభించిన జనజీవనం

By

Published : Nov 19, 2021, 10:36 AM IST

Updated : Nov 19, 2021, 1:12 PM IST

తమిళనాడును భారీ వర్షాలు(tamil nadu rain today) ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరదలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నై(Rains in chennai), పుదుచ్చేరి సరిహద్దును దాటి.. ఉత్తర తమిళనాడు దిశగా కదులుతోందని వాతావరణ శాఖ(IMD latest news) తెలిపింది.

చెన్నైలో భారీ వర్షం

13 జిల్లాల్లో విద్యాలయాలకు సెలవు

భారీ వర్షాల(Rains in Tamil nadu) కారణంగా 13 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. శుక్రవారం మధ్యాహ్నానికి వర్షాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకుంది. చెన్నై, తిరువల్లూర్​, కాంచిపురమ్​, వెళ్లూర్​, రాణిపెట్టాయ్​, తిరుపట్టూర్​, ధర్మపురి, క్రిష్ణగిరి, సేలం, నిలగిరి, విల్లుపురమ్​, కళ్లకురిచి, పెరంబలుర్​ జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

పాఠశాలలకు సెలవులు, ఇళ్లకు వెళుతున్న విద్యార్థులు

పుదుచ్చేరిలోనూ..

పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు(puducherry rain today) కురుస్తున్న కారణంగా పాఠాశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిచింది స్థానిక ప్రభుత్వం. కద్దలూర్​, చెంగళ్​పట్టు, అరియలూర్​, కరైకల్​ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేప్టటింది ప్రభుత్వం.

కర్ణాటకలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కర్ణాటకలో(karnataka rain today) మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగళూరుకు ఆరెంజ్​ అలర్ట్​.. ఉత్తర కర్ణాటక, తీర ప్రాంత జిల్లాలకు ఎల్లో అలర్ట్​ ప్రకటించింది. ఐదు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఐఎండీ బెంగళూరు తెలిపింది.

బెంగళూరులో భారీ వర్షం

కుప్పకూలిన భవనం..

బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాలు పలు ఇళ్లు, భారీ వృక్షాలు నెలకొరిగాయి. లిడోమాల్​, మిల్క్​మాన్​ రోడ్​ సమీపంలో ఓ పాత భవనం కుప్పకూలింది. నగరంలోని మహదేవపుర ప్రాతంలో 142మిల్లీమీటర్లు, హగపుర్​ 104 మిల్లీమీటర్లు, వర్తూర్​ 104మిల్లీమీటర్లు, విలయక్కుండిలో 97 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కుప్పకూలిన భవనం

ముగ్గురు మృతి

భారీ వర్షాలతో సరైన వెలుతురు లేక గురువారం సాయంత్రం బెంగళూరులో ఘోర ప్రమాదం(Road accident) జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో కారు, క్యాబ్​ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహీంద్ర ఎక్స్​యూవీ కారు.. నియంత్రణ కోల్పోయి డివైడర్​ దాటుకుని వచ్చి మరో కారును ఢీకొన్నట్లు బీటీపీ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు.

ఇదీ చూడండి:తమిళనాడులో భారీ వర్షాలు- తీర ప్రాంతాలకు రెడ్​ అలర్ట్​

Last Updated : Nov 19, 2021, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details