హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలీలోప్రజలు గుంపులుగా తిరగటంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అయితే.. ఇప్పటి వరకు చేపట్టిన కొవిడ్ కట్టడి చర్యలు విఫలమవుతాయని పేర్కొంది. కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న 73 జిల్లాలకు లేఖ రాసింది వైద్య శాఖ.
మరోసారి ఆంక్షలు!..
"ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే.. మరోసారి ఆంక్షలను విధించాల్సి ఉంటుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ప్రభావం ఉంది. యాక్టివ్ కేసులు సంఖ్య 5 లక్షల దిగువకు చేరాయి."