వైద్యులు భయం లేకుండా విధులు నిర్వర్తించే వాతావరణం కల్పించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది భారత వైద్య సంఘం(IMA). తమ సమస్యల పరిష్కారానికి ప్రధాని స్వయంగా జోక్యం చేసుకోవాలని కోరింది.
వైద్యులకు రక్షణ కల్పించాలని మోదీకి ఐఎంఏ లేఖ!
వైద్యులపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీ స్వయంగా కలుగజేసుకోవాలని కోరింది భారత వైద్య సంఘం(IMA). ఈ మేరకు మోదీకి లేఖ రాసింది. భయం లేకుండా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
వైద్యులపై దాడులు
ఇటీవల కాలంలో వైద్యులపై దాడులు పెరిగిన నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. అల్లోపతి, టీకాలపై దుష్ప్రచారం చేసేవారిని శిక్షించాలని కోరింది. దాడుల్లో, కరోనాతో మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని విన్నవించింది.
ఇదీ చూడండి:ఆస్పత్రిలో కరోనా రోగి మృతి- వైద్యుడిపై బంధువుల దాడి
Last Updated : Jun 7, 2021, 1:33 PM IST