తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IMA: జూన్ 18న దేశవ్యాప్తంగా ఆందోళనలు

వైద్యులపై పెరిగిపోతున్న దాడులను నిరసిస్తూ.. జూన్​ 18న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు భారత వైద్య సంఘం(ఐఎంఏ) తెలిపింది. 'రక్షకులను కాపాడండి' (సేవ్​ ది సేవియర్స్​) అనే నినాదంతో ఆందోళన చేయనున్నట్లు పేర్కొంది.

IMA
ఐఎంఏ

By

Published : Jun 12, 2021, 4:54 PM IST

వైద్యులపై దాడులను నిరసిస్తూ జూన్ 18న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు భారత వైద్య సంఘం(IMA) తెలిపింది. నల్ల బ్యాడ్జీలు, మాస్కులు ధరించి నిరసన తెలపాలని దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక కార్యాలయాలకు పిలుపునిచ్చింది. రక్షకులను కాపాడండి (సేవ్​ ది సేవియర్స్​) అనే నినాదంతో ఆందోళన చేయనున్నట్లు పేర్కొంది.

సెంట్రల్ ఆస్పిటల్​ అండ్ హెల్త్​ కేర్ ఫ్రొఫెషనల్స్ ప్రొటెక్షన్​ యాక్ట్​ను అమలు చేయాలని, ప్రతి ఆస్పత్రిలో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు వైద్యులు. జూన్​ 15వ తేదీని జాతీయ డిమాండ్​ డే గా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'

ABOUT THE AUTHOR

...view details