పతంజలి సంస్థ విడుదల చేసిన కొరొనిల్ టాబ్లెట్‌పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) విస్మయం వ్యక్తం చేసింది. కరోనా ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన తమ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ధ్రువీకరించిందని చెప్పడాన్ని తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని.. ఈ ఔషధ ఆవిష్కార కార్యక్రమానికి హాజరైన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను డిమాండ్ చేసింది.
"వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో ఉండి ఒక తప్పుడు, అశాస్త్రీయమైన వస్తువును ఎలా దేశ ప్రజల కోసం విడుదల చేస్తారు? కరోనాను ఎదుర్కొనే ఔషధం అని చెప్పేందుకు దీనిపై జరిగిన క్లినికల్ ట్రయల్స్ గురించి వివరిస్తారా? మంత్రి నుంచి దేశ ప్రజలకు వివరణ కావాలి. దీనిని సుమోటోగా తీసుకోవాలని జాతీయ వైద్య మండలికి మేము లేఖ రాశాం. కొరొనిల్‌ను డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరించిందన్న విషయాన్ని తెలుసుకుని మేం ఆశ్చర్యానికి గురయ్యాం."
-- ఇండియన్ మెడికల్ అసోసియేషన్.