యోగా గురు బాబా రాందేవ్కు(Baba Ramdev) భారతీయ వైద్య సంఘం(IMA) మధ్య వివాదం కొనసాగుతోంది. బహిరంగ చర్చకు రావాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ సవాల్ విసిరింది. కొవిడ్ రోగుల చికిత్సలో భాగంగా పతంజలి మందులు ఇస్తున్నారని పేర్కొన్న అల్లోపతి ఆసుపత్రులేవో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బాబా రాందేవ్కు లేఖ రాసింది ఐఎంఏ.
"మీరు బహిరంగంగా 25 ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు మా వంతు. మా నిపుణుల ప్రశ్నలకు మీరు, మీ బృందం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పతంజలి యోగ్పీఠ్ నిర్వహిస్తున్న పరిశోధనల్లో భాగంగా ఆ సంస్థకు చెందిన మందులను ఇస్తున్న అల్లోపతి ఆసుపత్రుల వివరాలు చెప్పాలి."