తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తాను.. వెనుక గుమ్మం నుంచి వెళ్లి కలిశానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జయలలిత స్మారకాన్ని శనివారం దర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.
చెన్నైలోని పల్లవరానికి చెందిన ప్రేమ.. ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారారు. దీనికి కారణం ఆమె చేసిన వ్యాఖ్యలే కారణం. తాను జయలలిత వారసురాలినని చెప్పుకొచ్చారు ప్రేమ.
త్వరలో శశికళను కలుస్తా..