Shashikala News: తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ మరోసారి చిక్కుల్లో పడ్డారు. అక్రమాస్తుల కేసులో ఆమె జైలు శిక్ష అనుభవించినప్పుడు సకల సదుపాయాల కోసం అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు బెంగళూరు ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. జైలు సిబ్బంది పేర్లను కూడా ఇందులో జత చేసింది.
ఓ అవినీతి కేసులో శిశకళ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవించారు. ఆ సమయంలో జైల్లో తాము అడిగిన సదుపాయాలు కల్పించేందుకు సిబ్బందికి ముడుపులు ఇచ్చినట్లు బెంగళూరు ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఇళవరసి నుంచి సిబ్బంది ఈ మొత్తాన్ని అందుకున్నట్లు తెలిపింది. ఆమె పేరును కూడా అభియోగపత్రంలో చేర్చింది.
ఈ వ్యవహారానికి సంబంధించి సీనియర్ పోలీసు అధికారి, ఆయన సిబ్బందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అనుమతి ఇచ్చింది.
అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లారు శశికళ, ఇళవరసి. 2021లో విడుదలయ్యారు.