తమిళనాడు చెన్నై విమానాశ్రయంలో చెప్పుల్లో తరలిస్తున్న 239 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ. 12లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బంగారంతో పాటు 6.5 లక్షల విలువ గల విదేశీ నోట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సౌదీ, అమెరికా కరెన్సీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు దుబాయ్ నుంచి వచ్చినట్లుగా నిర్ధరించారు.
చెప్పుల్లో బంగారం, కరెన్సీ నోట్లు- నిందితుడి అరెస్ట్ - బంగారం పట్టివేత
చెన్నై విమానాశ్రయంలో చెప్పుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం, విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. నిందితుడు దుబాయ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
చెప్పుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత