తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ ఘాతుకం- ఐదుగురిని చంపి.. అంత్యక్రియల్లో పాల్గొని.. - వివాహేతర సంబంధం

Illegal affair case: కర్ణాటక మండ్యలో ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం పెట్టుకొని లక్ష్మి అనే మహిళ ఈ పని చేసిందని పోలీసులు తెలిపారు.

gangaram family
గంగారం కుటుంబం

By

Published : Feb 10, 2022, 11:42 AM IST

Illegal affair case: కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించిన కేసును మూడు రోజుల్లోనే ఛేదించారు పోలీసులు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. ప్రియుడి భార్య సహా నలుగురు చిన్నారుల్ని హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలిని బుధవారం అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితురాలు సహా అనుమానితులను ప్రశ్నించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు.

అత్యక్రియల్లో పాల్గొని..

మండ్య జిల్లా శ్రీరంగపట్న తాలుకాలోని కేఆర్​ఎస్​ గ్రామంలో ఫిబ్రవరి 5న ఈ దారుణ ఘటన జరిగింది. మైసూరులోని బెలవట్టా గ్రామానికి చెందిన లక్ష్మి.. గంగారాం అనే వ్యక్తి ఇంటి వెనుకే నివసిస్తూ.. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారి సంబంధానికి గంగారాం భార్య అడ్డు చెప్పిందని, తమ నుంచి దూరం వెళ్లాలని చెప్పడం వల్ల ఆమెపై కోపం పెంచుకుంది. గంగారాం భార్య సహా పిల్లలను అడ్డు తొలగించుకొని అతన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది.

గంగారాం ఊరిలో లేని సమయం చూసుకున్న లక్ష్మి.. పౌల్ట్రి దుకాణంలో కొన్న కొడవలితో అతని భార్య లక్ష్మి(30), వారి పిల్లలు రాజు(12), కోమల్(7)​, కునాల్(4), గంగారాం సోదరుడి కుమారుడు గోవింద్​ని(12) హత్య చేసింది. మహిళ సహా.. నలుగురు చిన్నారులు విగతజీవులపై కనిపించటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. డబ్బు కోసమే వీరిని హత్య చేసినట్లు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆహారంలో మత్తు మందు ఇవ్వటమే కాక, విషం ప్రయోగం సైతం జరిగిందని అనుమానించారు.

ఇంటి వెనకాల ఉన్న మహిళపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. తమ వివాహేతర సంబంధానకిి అడ్డుగా ఉన్నారనే కారణంగానే వారిని హత్య చేసినట్లు మహిళ అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా మృతుల అంత్యక్రియల్లోనూ పాల్గొని కంటతడి పెట్టినట్లు చెప్పారు. అనుమానం రాకుండా ఇలా చేసినట్లు తెలిపారు.

పోస్ట్​మార్టం నివేదిక వచ్చాకే పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు పోలీసులు. నిందితురాలని అరెస్ట్​ చేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:ఒకే కుటుంబంలోని ఐదుగురు దారుణ హత్య- ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details