తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా మద్రాస్ ఐఐటీ - ఇంజనీరింగ్ కాలేజీల ర్యాంకింగ్​లు

దేశంలోని విద్యాసంస్థలకు కేంద్ర విద్యాశాఖ ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో మద్రాస్ ఐఐటీ టాప్ ర్యాంక్​ను సొంతం చేసుకుంది. కళాశాలల విభాగంలో దిల్లీలోని మిరండా హౌస్ ఉత్తమ కాలేజీగా నిలిచింది.

మద్రాస్ ఐఐటీ
మద్రాస్ ఐఐటీ

By

Published : Sep 9, 2021, 1:24 PM IST

ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్(IIT Madras) దేశంలోని విద్యాసంస్థల్లో అత్యుత్తమంగా నిలిచింది. ఇక పరిశోధనా సంస్థల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)-బెంగళూరు అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRFrankings 2021) ఆరో ఎడిషన్‌ ర్యాంకింగ్స్​ను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వీటిలో మొదటి పది స్థానాల్లో మొత్తం ఎనిమిది ఐఐటీలు, రెండు ఎన్ఐటీలు ఉన్నాయి.

  • బిజినెస్ స్కూళ్ల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM ahmedabad) అహ్మదాబాద్ టాప్​లో నిలిచింది.
  • ఫార్మసీ కోర్సులు అందించే కాలేజీల్లో జామియా హమ్‌దర్ద్ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.
  • కళాశాలల కేటగిరీలో.. దిల్లీలోని మిరండా హౌస్(Miranda House College) మొదటి ర్యాంక్​ను సాధించింది. లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్-దిల్లీ, లయోలా కాలేజ్-చెన్నై వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • మెడికల్ కాలేజీల విభాగంలో దిల్లీ ఎయిమ్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో పీజీఐఎంఈఆర్-చంఢీగఢ్ రెండు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్-వెల్లూరు మూడో స్థానంలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details