తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఈఈ ఫలితాలు విడుదల- తెలుగు విద్యార్థుల సత్తా! - ఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల విడుదల

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు(jee advanced result) విడుదలయ్యాయి. ఐఐటీ ఖరగ్​పుర్​.. జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకులను ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఐఐటీ దిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్ టాపర్​గా నిలిచాడు.

JEE Advanced Result
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

By

Published : Oct 15, 2021, 11:11 AM IST

Updated : Oct 15, 2021, 11:47 AM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు(jee advanced result) శుక్రవారం విడుదలయ్యాయి. ఐఐటీల్లో ప్రవేశానికి ఈ నెల 3న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ ఖరగ్‌పుర్‌ ప్రకటించింది.

ఈ ఫలితాల్లో(jee advanced result) జనరల్‌ కేటగిరీలో ఐఐటీ దిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్ టాపర్​గా నిలిచాడు. 360 మార్కులకు గాను 348 మార్కులతో మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. బాలికల విభాగంలో ఐఐటీ దిల్లీ జోన్‌కు చెందిన కావ్య చోప్రా (286మార్కుల) ప్రథమ స్థానంలో నిలిచింది.

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

జేఈఈ ఫలితాల్లో(jee advanced result) తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ విభాగంలో రామస్వామి సంతోష్‌ రెడ్డి తొలి ర్యాంకు సాధించాడు. ఎస్సీ కేటగిరీలో నందిగామ నిఖిల్‌కు మొదటి స్థానంలో నిచిచాడు. గుంటూరుకు చెందిన రుషికేష్‌ రెడ్డి పదో ర్యాంకు దక్కించుకోగా.. విజయవాడకు చెందిన దివాకర్ సాయి 11వ ర్యాంకు సాధించాడు

బాలురదే ఆదిపత్యం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌(jee advanced result) పరీక్షకు 1,51,193 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 1,41,699 మంది హాజరయ్యారు. 41,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 35,410 మంది బాలురు కాగా.. 6,452 మంది బాలికలు ఉన్నారు.

ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉండగా.. వాటికి శనివారం(అక్టోబరు 16) నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్లు, 27న సీట్లు కేటాయింపు జరపనున్నారు.

ఇదీ చూడండి:ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి

Last Updated : Oct 15, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details