corona third wave news in india: డెల్టా ప్రభావంతో వణికిపోతున్న ప్రపంచ దేశాలను.. ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి కలవరపెడుతోంది. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్ ప్రభావంతో రానున్న రోజుల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగవచ్చని ఇప్పటికే ఆయా దేశాలు అంచనా వేస్తున్నాయి.
omicron news update: ఇలాంటి సమయంలో వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన దేశంలో స్వల్ప స్థాయిలో థర్డ్‌వేవ్ కనిపించనుందని.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయిని చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అంచనా వేశారు. దేశంలో మహమ్మారి ప్రభావాన్ని గణితశాస్త్ర పరంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోన్న 'సూత్ర మోడల్'ను ఈయనే రూపొందించారు.
"భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య వచ్చే ఏడాది తొలి మాసంలో గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చు. అదే సమయంలో పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైరస్ కట్టడి చర్యల ద్వారా మూడోవేవ్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు"