మధుమేహం, ఊబకాయానికి వాడే ఔషధాలు కొవిడ్-19 చికిత్సలోనూ (Covid treatment) ఉపయోగపడతాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) పరిశోధకులు కనుగొన్నారు. కొవిడ్, వృద్ధాప్యం, మధుమేహం మధ్య జీవ అణువుల సంబంధాన్ని వీరు తమ పరిశోధనలో సమీక్షించారు. (Drugs to cure Covid 19)
"మొక్కలనుంచి వచ్చే ఆహారంలో కనిపించే పాలీఫెనాల్స్..ఉదాహరణకు కర్క్‌మిన్ (పసుపులో కనిపించేవి), రెస్వరెట్రాల్ లాంటివి వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి. వీటిలోనూ వైరస్‌ను నిరోధించే లక్షణాలు ఉంటాయి" అని ఐఐఎస్‌ఈఆర్ శాస్త్రవేత్త అమ్జాద్ హుస్సేన్ తెలిపారు. (Covid drug)