తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాలో కొత్త ఉత్పరివర్తనలు, ప్రొటీన్లు గుర్తింపు - ఉత్పరివర్తనలు

కరోనా వైరస్‌ ఉత్పరివర్తన తీరు, దానికి సంబంధించిన ప్రొటీన్ల వివరాలను గుర్తించడం చాలా ముఖ్యం. అవి గుర్తిస్తేనే దాని వల్ల కలిగే వ్యాధులను నయం చేసేందుకు టీకా, ఇతర మందులను కనుగొనేందుకు వీలవుతుంది. తాజాగా ఈ వైరస్​కు సంబంధించి అనేక పరిశోధనలు చేసిన భారతీయ శాస్త్రవేత్తలు.. ప్రత్యేక ప్రొటీన్లను గుర్తించారు. తరువాతి పరిశోధనలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తలు.

iisc indian scientists found new kind of proteins in corona virus
కరోనాలో కొత్త ఉత్పరివర్తనలు, ప్రొటీన్లు గుర్తించిన భారత శాస్త్రవేత్తలు

By

Published : Mar 5, 2021, 6:48 AM IST

చీజి కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లో అనేక మార్పులు (ఉత్పరివర్తనలు), కొన్ని ప్రత్యేక ప్రొటీన్లను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌పై పోరాడే క్రమంలో మానవ శరీరం కూడా అనేక ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుందని వారు కనుగొన్నారు. బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు ఈ ఘనత సాధించారు.

జన్యు విశ్లేషణ..

ఏదేనీ వైరస్​ జన్యు సమాచారం ఆధారంగానే ప్రొటీన్లు తయారవుతాయి కాబట్టి వీటి గురించి అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు.. కొవిడ్‌ బాధితుల నాసిక స్రవాల నుంచి వైరస్‌ నమూనాలను సేకరించారు. కొత్త తరం సీక్వెన్సింగ్‌ (ఎన్‌చ్కీజీజిఎస్‌) సాయంతో వాటిపై విశ్లేషణ జరిపారు. వైరస్‌ జన్యుక్రమం మొత్తాన్నీ వేగంగా ఆవిష్కరించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. వైరస్‌ రకాల జన్యుక్రమాన్ని ఆవిష్కరించడం వల్ల ఉత్పన్నమయ్యే కొత్త ఉత్పరివర్తనలను వేగంగా గుర్తించడానికి వీలవుతుందని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన ఉత్పల్‌ తాటు చెప్పారు. గతంతో పోలిస్తే ఇప్పుడు వైరస్‌ చాలా వేగంగా మార్పులకు లోనవుతోందని తమ పరిశీలనలో తేలినట్లు తెలిపారు. బెంగళూరులో సేకరించిన మూడు వైరస్‌ నమూనాల్లో 27 ఉత్పరివర్తనలు ఉన్నాయని చెప్పారు. ఒక్కో నమూనాలో 11కుపైగా మార్పులు ఉన్నాయన్నారు. జాతీయ సరాసరి (8.4), ప్రపంచ సరాసరి (7.3) కన్నా ఇది ఎక్కువని చెప్పారు. బెంగళూరులోని వైరస్‌ రకాలకు బంగ్లాదేశ్‌ రకంతో దగ్గర పోలికలు ఉన్నాయని వివరించారు.

గుండెపై కరోనా ప్రభావం ఎలా అంటే..?

కొవిడ్​​ నుంచి కోలుకున్నా.. ఇతర సమస్యలతో అతలాకుతలం

కరోనా వైరస్‌ జన్యుక్రమం 25కుపైగా ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుందని, వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పటివరకూ గుర్తించారని ఉత్పల్‌ చెప్పారు. తాము కొత్తగా 13 ప్రొటీన్లను కనుగొన్నామని తెలిపారు. కొవిడ్‌-19 బాధితుల్లో మాత్రమే కనిపించిన 441 ప్రొటీన్లను గుర్తించామని చెప్పారు. వీటిలో చాలావరకూ.. కరోనా వైరస్‌పై మానవ రోగనిరోధక జరిపే పోరులో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

ఇదీ చదవండి:'20 ఏళ్లలో చైనా నుంచి 5 మహమ్మారులు'

ABOUT THE AUTHOR

...view details