Igunas in Malappuram: కుక్కలు, పిల్లులు, చిలుకలు, తాబేళ్లను ఇళ్లలో పెంచుకోవడం ప్రస్తుత కాలంలో సహజమే. కానీ, కేరళలో ఓ జంతు ప్రేమికుడు వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టాడు. మంజేరి సమీపంలోని కరాకన్నుకు చెందిన సునీర్ అనే వ్యక్తి.. విదేశీ జాతికి చెందిన బల్లులను పెంచుతున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ..
దక్షిణ అమెరికా జాతికి చెందిన ఐదు బల్లులను రెండున్నరేళ్లుగా పెంచుతున్నాడు సునీర్. వీటికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సునీర్ పెంచుకుంటున్న ఓ ఆడబల్లి ఏకంగా 40 గుడ్లు పెట్టింది. ఒకరి పెంపకంలో బల్లి ఇన్ని గుడ్లు పెట్టడం చాలా అరుదు.
ఈ రకం బల్లులు.. చూసేందుకు భయంకరంగా ఉంటాయి. డైనోసర్లను పోలిన రూపంలో వింతగా కనిపిస్తాయి. అయితే, వీటితో మనుషులకు ఎటువంటి అపాయం ఉండదు. ఇవి ఆకులు, కూరగాయలు మాత్రమే తింటాయి. గత రెండేన్నరేళ్లుగా వీటిని పెంచుతున్న సునీర్కు ఇవి బాగా మచ్చిక అయిపోయాయి.