తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉద్యోగాలకు అనర్హుల ఎంపిక రాజ్యాంగ విరుద్ధం'

అనర్హులను ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేయడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది సుప్రీం కోర్టు. ఝూర్ఖండ్‌లో 2008 నాటి పోలీసు నియామకాలపై దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపిన ధర్మాసనం.. సవరించిన జాబితా ప్రకారం నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.

Ignoring merit in public job selection violation of Constitution: SC
'అనర్హులను ఎంపిక చేయడం రాజ్యాంగ విరుద్ధం'

By

Published : Feb 25, 2021, 7:37 PM IST

అర్హులను కాదని అనర్హులను ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఝార్ఖండ్‌లో 2008లో జరిగిన పోలీసు ఉద్యోగ నియామకాలపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ ఎల్​.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సవరించిన జాబితాతో నియామకాలు జరపాలని ఝార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పోలీసు నియామకాల్లో అర్హత ఆధారంగా సవరించిన జాబితాతో 43మందిని ఉద్యోగాల్లో నియమించడానికి అనుమతించింది.

2008లో ఝార్ఖండ్ ప్రభుత్వం.. పోలీసు శాఖలో ఎస్​ఐ సహా పలు పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రక్రియను పూర్తి చేసి 382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. అర్హులు కాని వారిని ఎంపిక చేసినట్లు తేలింది.

ఇదీ చూడండి:'టీ కోసం భార్యపై దాడా? సమ్మతం కాదు'

ABOUT THE AUTHOR

...view details