కాంగ్రెస్ హయాంలో హింస, ఆందోళనలు, బాంబు పేలుళ్లతో కూడిన భయానక వాతావరణంలో ఉన్న అసోం.. ప్రస్తుతం భాజాపా పాలనలో శాంతి, అభివృద్ధి పథంలో నడుస్తోందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. జొనాయ్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. విభజించు, పాలించు అనే విధానాన్ని ఆ పార్టీ పాటిస్తుందని ఆరోపించారు. 'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్' భాజపా విధానమని చెప్పారు.
"అసోం గౌరవాన్ని కాపాడతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. బహిరంగంగా ఆయన్ను ఓ విషయం అడుగుతున్నా. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌తో జట్టుకట్టిన ఆ పార్టీకి అది సాధ్యమవుతుందా? అస్సామీలు, బంగాలీలు, మైదానాలు, పర్వత ప్రాంతాలు, వంటి విభేదాలను కాంగ్రెస్ సృష్టించింది. భాజపా చిన్న చిన్న వర్గాలను ఏకం చేస్తూ వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తోంది. అభివృద్ధి కావాలో, అస్థిరత కావాలో తేల్చుకునే ఎన్నికలు ఇవి. ఎమ్మేల్యేలు, సీఎంలను ఎన్నికునే ఎన్నికలు కావు ఇవి. అసోం గౌరవాన్ని కాపాడుతూ అభివృద్ధి పథంలో మరింత ముందుకు నడిపించేందుకు జరిగే ఎన్నికలు ఇవి."
--అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.