తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరీక్షలో ఏదో ఒకటి రాసి పేపర్ నింపండి చాలు' - cbse exam controversy

'ఏదో ఒకటి రాసి పేపర్​ నింపండి' అంటూ విద్యార్థులతో ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

delhi, dept of education
'పరీక్షలో ఏదోటి రాసి పేపర్ నింపండి'

By

Published : Feb 19, 2021, 10:31 AM IST

Updated : Feb 19, 2021, 10:44 AM IST

దిల్లీ విద్యాశాఖ కార్యదర్శి ఉదిత్​ రాయ్​ పరీక్షలకు సంబంధించి విద్యార్థులతో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 'ఏదో ఒకటి రాసి పేపర్లు నింపండి' అంటూ.. విద్యార్థులతో రాయ్​ సంభాషిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

"మీకు సమాధానాలు తెలియకపోతే ఏదో ఒకటి రాయండి. ప్రశ్నల్నే మళ్లీ కింద నింపినా అభ్యంతరం లేదు. కానీ జవాబు పత్రాలను ఖాళీగా ఉంచొద్దు. మేము మీ ఉపాధ్యాయులతో మాట్లాడాము. మీరు ఏదో ఒక జవాబు రాస్తే సరిపోతుందన్నారు. మీరు ఏది రాసినా మార్కులు వేయమని సీబీఎస్​ఈకి కూడా చెప్పాను."

-ఉదిత్​ రాయ్​, విద్యాశాఖ డైరెక్టర్​

ఈ వీడియోపై స్పందించిన ప్రతిపక్షాలు.. కేజ్రీవాల్​ ప్రభుత్వంపై మండిపడ్డాయి. 'మీరు ఇలాగే పరీక్షలు రాసి ఐఏఎస్​ అయ్యారా?' అని భాజపా నేతలు ఎద్దేవా చేశారు. 'కేజ్రీవాల్​ జీ, ఇదేం విద్యా విధానం? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకండి,' అని కాంగ్రెస్​ అభ్యర్థించింది.

సీఎంకు లేఖ..

ఈ వివాదంపై అఖిల భారత తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు అశోక్​ అగర్వాల్ సీఎం కేజ్రీవాల్​కు లేఖ రాశారు. సంబంధిత అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి అయిన సిసోడియా కూడా ఇందుకు బాధ్యత వహించాలన్నారు.

ఇదీ చదవండి :'రైతులతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే'

Last Updated : Feb 19, 2021, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details