విద్యావ్యవస్థలో నూతన విధానాలెప్పుడూ..ఉపాధ్యాయులు, విద్యార్థుల సలహాల నుంచే రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఈ విధానం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, తిరునల్వేలిలోని సెయింట్ జేవియర్ కళాశాల ప్రొఫెసర్లతో రాహుల్ సంభాషించారు.
'విద్యావ్యవస్థలో మార్పులు వారి సూచనల మేరకు జరగాలి' - any policy made for the education that comes from conversation from professors and students
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు, విద్యార్థుల చర్చల నుంచి వచ్చిన విధానాలనే విద్యావ్యవస్థలో పొందుపరుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు, తిరునల్వేలిలోని సెయింట్ జేవియర్ కళాశాల ప్రొఫెసర్లతో సంభాషించారు.
'వారి విధానాలనే విద్యావ్యవస్థలో తీసుకువస్తాం'
ఆర్థికంగా బలమైనవారికే విద్య అనే విధానాన్ని తాను అంగీకరించనని రాహుల్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే విద్యార్థులకు స్కాలర్షిప్లను పెంచుతామని అన్నారు.
ఇదీ చదవండి:'దేశానికి వ్యవసాయమే ప్రధాన వ్యాపారం'