తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నితీశ్​ సీఎం అయితే ఆ గొప్పదనం శివసేనదే'

బిహార్​ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీఏకి గట్టపోటీ ఇచ్చిన లాలూ కుమారుడు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​ను శివసేన ప్రశంసలతో ముంచెత్తింది. ఈమేరకు వారి సొంత పత్రిక సామ్నాలో సంపాదకీయాన్ని ప్రచురించింది. నితీశ్​ కుమార్​ మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం కష్టమని... పొరపాటున అది నిజం అయితే ఆ గొప్పదనం శివసేనకు చెందుతుందని తెలిపింది.

If Nitish becomes Bihar CM, credit goes to Shiv Sena: Saamana
నితీశ్​ సీఎం అయితే ఆ గొప్పదనం శివసేనదే: సామ్నా

By

Published : Nov 11, 2020, 1:29 PM IST

Updated : Nov 11, 2020, 1:39 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ఉద్ధండులకు సైతం గట్టిపోటీ ఇచ్చి నిలబడిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​పై ప్రశంసల వర్షం కురిపించింది శివసేన. భాజపాతో కలిసి పోటీచేసిన జేడీయూ తక్కువ స్థానాలతో సరిపెట్టుకున్న నేపథ్యంలో నితీశ్​కుమార్​ సీఎం అవ్వడంపై అనుమానం వ్యక్తం చేసింది. గతంలో మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ సొంత పత్రిక సామ్నాలో సంపాదకీయాన్ని ప్రచురించింది.

ఎవరూ ఊహించని విధంగా భాజపా అనూహ్య ఫలితాలు సాధించగా కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే దానిపై అనుమానం వ్యక్తం చేసింది శివసేన. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ మొదట శివసేనకు మాట ఇచ్చి తప్పారని గుర్తు చేసింది. నితీశ్​కుమార్​ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తే.. ఆ గొప్పదనం కచ్చితంగా సేనకే చెందుతుందని అభిప్రాయపడింది.

భవిష్యత్ తేజస్వీదే...

రాబోయే రోజుల్లో తేజస్వీ బిహార్​ అశాకిరణం కానున్నారని తెలిపింది సామ్నా. మోదీ, నితీశ్​ వంటివారి చరిష్మాఆయన ముందు పని చేయలేదని తెలిపింది. అధికారంలో లేనప్పటికీ తేజస్వీ ప్రజల కోసం ఒంటరిగా పోరాడారని కితాబిచ్చింది. ఇప్పటికీ తేజస్వీ ఓడిపోలేదని.. పట్నా, దిల్లీ పాలకులపై చేసిన పోరాటంలో విజయం సాధించారని స్పష్టం చేసింది. తేజస్వీని ప్రచారంలో మానసికంగా దెబ్బదీసేలా విమర్శలు చేసినా ఆయన మాత్రం బిహార్​ అభివృద్ధి పైనే దృష్టి కేంద్రీకరించారని పేర్కొంది.

ఇదీ చూడండి: పోటీ చేయకుండా 15 ఏళ్లుగా సీఎం- ఎలా సాధ్యం?

Last Updated : Nov 11, 2020, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details