మహమ్మారి సమయంలో చట్టాలను ప్రవేశపెడుతున్నప్పుడు.. సాగు చట్టాలను ఎందుకు రద్దు చేయలేరని కేంద్రాన్ని ప్రశ్నించారు రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో కూడా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన విరమించమని ఉద్ఘాటించారు. ఈ ఉద్యమం విజయవంతం అయితే భవిష్యత్తు తరాల రైతులకు కూడా మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగు చట్టాల నిరసనలు ఆరు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం గాజియాబాద్‌లో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'ప్రభుత్వ ప్రాధాన్యం రైతులకే'