కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం భవిష్యత్ అవసరాలను తీర్చే విధానం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ పాత్రను కీర్తించారు మోదీ. స్వతంత్రం తర్వాత దేశ ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన గొప్ప పునాది వేశారని అన్నారు. ప్రస్తుతం నైపుణ్యం కల్గిన యువతకు డిమాండ్ పెరుగుతున్నందున వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మోదీ తెలిపారు.
విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న మోదీ.. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిగా ఉన్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు.
"జాతీయ విద్యా విధానం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విధానం. ప్రపంచంలో భవిష్యత్ అవసరాలను తీర్చే ప్రదేశంగా భారత్‌ను చూస్తున్నారు. దేశంలో నైపుణ్యాభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో నైపుణ్యం కల్గిన యువతకు డిమాండ్ పెరుగుతోంది. దానికి సంబంధించిన అవసరాలను తీర్చేందుకు నిరంతరం పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకుంటున్నాం. దేశంలోని మూడు పెద్ద నగరాల్లో నైపుణ్యాభివృద్ధి సంస్ధలను ఏర్పాటు చేయనున్నాం."