తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mizoram covid: 'వారిలో లక్షణాలు లేకుంటే ఆందోళన అక్కర్లేదు'

పిల్లలకు కరోనా సోకినా వారిలో లక్షణాలు(Covid symptoms in kids) బయటకు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం నిపుణులు చెబుతున్నారు. అది అంత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌(Mizoram covid) కాదని నిపుణులు స్పష్టంచేశారు. అలాగే పెద్దల మాదిరిగానే చిన్నారులూ (covid in children) కొవిడ్​ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నట్లు పలు సర్వేల్లో తేలిందని పేర్కొన్నారు.

covid in child
పిల్లల్లో కరోనా లక్షణాలు

By

Published : Sep 17, 2021, 8:07 AM IST

చిన్నారులు కరోనాకు గురైనా బయటకు లక్షణాలు (Covid symptoms in kids) వెల్లడవకపోతే (అసింప్టమాటిక్‌) అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది అంత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కాదని నిపుణులు స్పష్టంచేశారు. మిజోరం (Mizoram covid), కేరళ తదితర రాష్ట్రాల్లో పదేళ్లలోపు చిన్నారుల్లో కొవిడ్‌-19 (covid symptoms in kids) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో ఒకవేళ ఎక్కువ మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం తలెత్తినా లేక ఇతర ఎలాంటి ఆరోగ్య సంబంధ అవసరాలు తలెత్తినా అందుకు సిద్ధంగా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి దేశంలోని మొత్తం కరోనా క్రియాశీల కేసుల్లో పదేళ్లలోపు చిన్నారుల శాతం పెరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మిజోరం, మేఘాలయ, మణిపుర్‌, కేరళ రాష్ట్రాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉంది.

మిజోరంలో కేసుల జోరు..

మిజోరంలో(Mizoram covid) ఒక్క మంగళవారమే 1,502 మందికిపైగా కొవిడ్‌-19(Third wave of corona) బారిన పడ్డారు. వీరిలో 300 మంది చిన్నారులు ఉన్నారు. 'ఎన్‌టాగి'కి చెందిన కొవిడ్‌-19 జాతీయ కార్యదళ ఛైర్మన్‌ ఎన్‌కే అరోడా మాట్లాడుతూ.. "ఒకవేళ చిన్నారులకు కొవిడ్‌-19 (covid in children) పాజిటివ్‌గా తేలినా వారిలో లక్షణాలు బయటకు కనిపించకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో పలు దఫాలు నిర్వహించిన సీరో సర్వేలో పెద్దల మాదిరిగానే చిన్నారులూ కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నట్లు వెల్లడైంది" అని చెప్పారు. వారు తీవ్రస్థాయిలో వైరస్‌ బారిన పడడం అత్యంత అసాధారణ విషయమని స్పష్టం చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేయడం వల్ల చాలా మంది తమ పిల్లలతో కలిసి ప్రయాణాలు చేయడం ప్రారంభించారని, అందువల్ల ఇప్పటివరకు కరోనా బారిన పడని చిన్నారులు సైతం వైరస్‌ బారిన పడే అవకాశముందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా(Randeep Guleria on third wave) చెప్పారు. "ఈ కారణంగా భారీ సంఖ్యలో చిన్నారులు ఆసుపత్రుల్లో చేరతారని, మరణించే ప్రమాదం ఉందని భావించరాదు. చాలామంది చిన్నారుల్లో లక్షణాలు బయటకు కనిపించడం లేదు. మరికొందరు అత్యంత స్వల్పంగా వైరస్‌ బారిన పడుతున్నారు" అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:కేరళలో మళ్లీ కొవిడ్​ కల్లోలం- కొత్తగా 22 వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details