దేశంలో కరోనా రెండో దశ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్(Corona third wave in india) కూడా రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మూడో దశ(Corona third wave in india) వచ్చినా.. దాని ప్రభావం పెద్దగా ఉండబోదని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) వెల్లడించింది. దాని(Coronavirus) తీవ్రత తక్కువగానే ఉండనున్నట్లు పేర్కొంది.
"దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. భారీ సంఖ్యలో జనాభా మొదటి, రెండో డోసులు వేసుకున్నారు. వైరస్‌ను చాలా వరకు నివారించే శక్తి మన టీకాలకు ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్ పాజిటివ్‌గా తేలినా.. దాని తీవ్రత పెద్దగా ఉండదు. ఒకవేళ మూడో దశ వచ్చినా.. రెండో దశతో పోలిస్తే తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది"
-శేఖర్ సి మండే, సీఎస్ఐఆర్ డైరెక్టర్.
వివిధ దేశాల్లో కరోనా ప్రభావాన్ని బట్టి చూస్తే మన దగ్గరా మూడో దశ (థర్డ్ వేవ్)(Corona third wave in india) ఉండే అవకాశం ఉందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గతంలో వెల్లడించారు. వైరస్‌లో తీవ్రమైన ఉత్పరివర్తనాలు జరిగితే తప్ప భారత్‌లో దాని ప్రభావం తక్కువేనని తెలిపారు. థర్డ్‌వేవ్ పిల్లలపై తీవ్రత చూపుతుందనే దానిపై సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు.
దేశంలోని పలువురు నిపుణులు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తేనే మరో వేవ్ వచ్చే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం కాన్పుర్ ఐఐటీ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బయోటెక్నాలజీ విభాగం సెక్రెటరీ డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ మూడో వేవ్ వచ్చేలా ప్రజలు ప్రవర్తిస్తేనే అది వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఇదీ చూడండి:కరోనా చికిత్సలో ఆ మందులు వాడొద్దు: ఐసీఎంఆర్
ఇదీ చూడండి:Delta variant: కొత్తకోరలు తొడుక్కుంటున్న మహమ్మారి