దారితప్పిన జింక పిల్ల.. ఊర్లో చేరి రచ్చ రచ్చ Idukki deer: అత్యంత అరుదుగా కనిపించే జింకపిల్ల ఒకటి కేరళ ఇడుక్కిలోని కూట్టర్లో హల్చల్ చేసింది. మొరుగుతూ.. ఊరంతా తిరిగింది. దారితప్పి ఊర్లోకి వచ్చి.. గ్రామస్థులను పరుగులు పెట్టించింది. దాదాపు ఊర్లోని అన్ని దుకాణాల్లోకి దూరి బీభత్సం చేసింది. చివరకు గ్రామస్థులు దాన్ని బంధించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం వాళ్లు అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు.
దారితప్పిన జింకపిల్ల.. ఊర్లో చేరి రచ్చ రచ్చ ఇదీ జరిగింది..
కూట్టర్లోకి జింకపిల్ల గురువారం మధ్యాహ్నం ప్రవేశించింది. అడవి నుంచి దారితప్పి నది, వంతెనను దాటి ఊర్లోకి వచ్చింది. రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనాలను చూసి బయపడి అరవడం ప్రారంభించింది. అది చూసిన గ్రామస్థులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వాళ్ల నుంచి తప్పించుకుని అది పరుగులు పెట్టింది. ఊర్లోని దుకాణాలన్నింటినీ చుట్టేసింది. ఓ షాపు యజమాని జింకపిల్లను చూసి భయంతో బయటకు ఎగిరిదూకాడు. చివరకు ఎలాగోలా జింకపిల్లను పట్టుకున్నారు స్థానికులు. అది షాపులో ఉండగా.. ఓ బస్తాలో బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దారితప్పిన జింకపిల్ల.. ఊర్లో చేరి రచ్చ రచ్చ అటవీప్రాంత సమీపంలో ఉన్న ఇడుక్కి జనావాసాల్లోకి అప్పుడప్పుడు పులులు, ఏనుగులు వస్తుంటాయి. జింకపిల్ల రావడం ఇదే తొలిసారి. దీంతో అనుకోని అతిథి రావడం చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
దారితప్పిన జింకపిల్ల.. ఊర్లో చేరి రచ్చ రచ్చ ఇదీ చదవండి:పోలీస్ 'ఛేజింగ్ సీన్' సూపర్- కూలీ ఫోన్ను దొంగ ఎత్తుకెళ్తుండగా..