Idol Demolition in Delhi: దేవుడిపై కోపంతో విగ్రహాలను ధ్వంసం చేశాడో యువకుడు. ఈ ఘటన జనవరి 29న దిల్లీలో జరిగింది.
ఇదీ జరిగింది..
పోలీసుల కథనం ప్రకారం.. యువకుడి కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఇటీవల మరణించారు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన నిందితుడు.. దేవుడిపై కోపాన్ని పెంచుకున్నాడు. విగ్రహాల దుష్ప్రభావం కారణంగా తమ కుటుంబానికి హాని కలుగుతోందని భావించాడు. జనవరి 29న దగ్గరిలోని ప్రార్థనా మందిరానికి వెళ్లి, అక్కడి విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఘటనాస్థలిలో ఉన్నవారు యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.