తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IDBI Executive 2023 : 1,036 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. రెండు రోజులే ఛాన్స్! - idbi job recruitment 2023

IDBI Executive Recruitment : ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ భారీ స్థాయిలో ఎగ్జిక్యూటివ్​ పోస్టుల​ నియామకాలకు నోటిఫికేషన్​ జారీ చేసింది. ​ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలుకాగా, జూన్​ 7తో అది ముగియనుంది. సమయం తక్కువ ఉంది కనుక అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది.

idbi bank jobs
IDBI EXECUTIVE Recruitment

By

Published : Jun 5, 2023, 9:23 AM IST

IDBI Executive Recruitment 2023: బ్యాంకింగ్​ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఇండస్ట్రియల్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఐడీబీఐ) రెండు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా 1,172 పోస్టుల భర్తీకి ప్రకటన​ విడుదల చేసింది. ఇందులో 136 స్పెషలిస్ట్​ క్యాడర్ ఆఫీసర్​ పోస్టులకు ఒక నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఇవి కాకుండా కాంట్రాక్ట్​ ప్రాతిపదికన 1,036 ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్​ విడుదల చేసింది.

స్పెషలిస్టు క్యాడర్​ ఆఫీసర్​ పోస్టుల ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు జూన్​ 1 నుంచి 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఉద్యోగాలు అన్నింటికీ గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి అని స్పష్టం చేశారు. వీరికి కనిష్ఠంగా రూ.29 వేలు, గరిష్ఠంగా రూ.1,55,000 వరకు జీతం ఇస్తారు.

  • మేనేజర్​ పోస్టులు - 84
  • అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​ - 46
  • డిప్యూటీ జనరల్​ మేనేజర్​ - 6

ఎగ్జిక్యూటివ్​ (కాంట్రాక్ట్​) పోస్టుల ఎంపిక ప్రక్రియ
కాంట్రాక్ట్​ ప్రాతిపదికన తీసుకునే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 24 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ, జూన్​ 7వ తేదీతో ముగియనుంది.

పరీక్ష ఎప్పుడు?
జూలై 2న ఆన్​లైన్​లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కానీ పరీక్ష తేదీలు మార్చే అవకాశం కూడా ఉంటుందని సూత్రప్రాయంగా స్పష్టం చేశారు.

వయోపరిమితి
IDBI Age Limit :అభ్యర్థుల​ వయస్సు 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అయితే ప్రభుత్వ నియమాల ప్రకారం కేటగిరిల వారీగా ఏజ్​ రిలాక్సేషన్​ ఉంటుంది.

విద్యార్హతలు
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి.

పరీక్ష ఫీజు ఎంత
IDBI Executive Exam Fee: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.200గా.. మిగతా అన్ని కేటగిరిల అభ్యర్థులకు రూ.1000 పరీక్ష ఫీజు నిర్ణయించారు.

పోస్టుల భర్తీ.. కొనసాగింపు
IDBI Executive Selection Process : ఆన్​లైన్ టెస్ట్​, డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్​ టెస్ట్​ నిర్వహించి ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు ఒప్పంద ప్రాతిపదికపైన పనిచేయాలి. ఆ తరువాత వారి పనితీరును అనుసరించి ఏటా సర్వీసును పొడిగిస్తూ ఉంటారు.

వేతనం ఎంత ఉండొచ్చు
IDBI executive salary : ఒప్పంద ఉద్యోగులకు తొలి ఏడాది రూ.29 వేలు, రెండో ఏడాది రూ.31 వేలు, మూడో సంవత్సరం రూ.34 వేలు చొప్పున వేతనం ఇస్తారు. పూర్తి వివరాల కోసం ఐడీబీఐ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి.

ఇవీ చదవండి:Bank jobs 2023 : ఐబీపీఎస్​ భారీ నోటిఫికేషన్​.. పోస్టులు, దరఖాస్తు వివరాలు ఇలా..

పోస్టాఫీసుల్లో భారీగా ఉద్యోగాలు.. పదో తరగతి పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే జాబ్

ABOUT THE AUTHOR

...view details