IDBI Bank Jobs 2023 : బ్యాంకులో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ).. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో ఖాళీగా ఉన్న 2100 జేఏఎం, ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల యువతీయువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు(IDBI Job Vacancy 2023)..
- జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ 'ఓ' : 800 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్వో) : 1300 ఖాళీలు
విద్యార్హతలు(IDBI Bank Jobs Qualification)..
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ఉండాలి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి..
IDBI Bank Jobs Age Limit :2023 నవంబర్ 1 నాటికి అభ్యర్థులు 25 సంవత్సరాలు మించకూడదు. కనిష్ఠ వయసు 20 సంవత్సరాలు ఉండాలి.
జీత భత్యాలు..
IDBI Bank Jobs Salary :జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.29,000 నుంచి రూ.54,000. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000 వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము..
IDBI Bank Jobs Application Fees :ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200, మిగతా కేటగిరీ అభ్యర్థులకు రూ.1000ని అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు.