తెలంగాణ

telangana

ETV Bharat / bharat

IDBI Assistant Manager Jobs 2023 : డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐలో 600 జూ.అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

IDBI Assistant Manager Jobs 2023 In Telugu : ఐడీబీఐ బ్యాంక్​ 600 జూనియర్ అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

IDBI Bank jobs 2023
IDBI Assistant Manager Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 10:18 AM IST

IDBI Assistant Manager Jobs 2023 :బ్యాంకింగ్​ రంగంలో మంచి ఉద్యోగం సంపాదించాలని ఆశించే అభ్యర్థులు అందరికీ శుభవార్త. ఐడీబీఐ బ్యాంక్​ 600 జూనియర్​ అసిస్టెంట్​ మేనేజర్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్​ 30లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జూనియర్​ అసిస్టెంట్ మేనేజర్​ (గ్రేడ్​ - O) పోస్టుల వివరాలు

  • యూఆర్​ - 243 పోస్టులు
  • ఓబీసీ - 162 పోస్టులు
  • ఎస్సీ - 90 పోస్టులు
  • ఎస్టీ - 45 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 60 పోస్టులు
  • మొత్తం - 600 పోస్టులు

విద్యార్హతలు

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కంప్యూటర్​ పరిజ్ఞానం ఉండాలి. అలాగే స్థానిక భాష కూడా తెలిసి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 31 నాటికి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
IDBI Junior Assistant Manager Fee :

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.1000 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మాత్రం రూ.200 దరఖాస్తు రుసుముగా చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి గ్రూప్​ డిస్కషన్​, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయినవారిని.. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు చేసి.. ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్​సైట్​ https://www.idbibank.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుది.

  • ఏపీలోని పరీక్ష కేంద్రాలు : శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు
  • తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్​, కరీంనగర్​, ఖమ్మం, వరంగల్​

జీతభత్యాలు
IDBI Junior Assistant Manager Salary :ఎంపికైన అభ్యర్థులకు 6 నెలలు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వారికి నెలకు రూ.5000 చొప్పున ఇస్తారు. ఇంటర్న్​షిప్​లో (2 నెలలు) నెలకు రూ.15,000 చొప్పున అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని.. ఉద్యోగంలో చేరినవారికి వార్షిక వేతనంగా రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు
IDBI Junior Assistant Manager Last Date To Apply

  • ఆన్​లైన్​ దరఖాస్తులు ప్రారంభం : 2023 సెప్టెంబర్​ 15
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ : 2023 సెప్టెంబర్ 30
  • ఆన్​లైన్ పరీక్ష తేదీ : 2023 అక్టోబర్​ 20

ABOUT THE AUTHOR

...view details