తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐసీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు వాయిదా - ఐసీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు వాయిదా

దేశంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఐసీఎస్​ఈ 10,12వ తరగతుల పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఐసీఎస్​ఈ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి జెర్రీ ఆరథూన్ తెలిపారు. పరీక్షల నిర్వాహణపై జూన్​లో సమీక్ష జరుపుతామన్నారు.

ICSE
ఐసీఎస్‌ఈ

By

Published : Apr 16, 2021, 7:39 PM IST

భారత్​లో కరోనా విజృంభణ నేపథ్యంలో 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐసీఎస్​ఈ వెల్లడించింది. కొవిడ్​ మహమ్మారి వ్యాప్తితో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్​ఈ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి జెర్రీ ఆరథూన్​ తెలిపారు.

" దేశంలో కరోనా పరిస్థితిని పరిశీలించి పరీక్షల నిర్వాహణపై జూన్​లో సమీక్ష నిర్వహిస్తాం. 12వ తరగతి పరీక్షలు తర్వాత నిర్వహిస్తాం. అయితే 10 వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించటం లేదా పరీక్షలు లేకుండా గ్రేడ్స్​ ఇస్తాం."

-- జెర్రీ ఆరథూన్, ఐసీఎస్​ఈ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి

అంతకుముందు కరోనా వ్యాప్తి దృష్ట్యా సీబీఎస్​ఈ బోర్డు.. 10 వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.

ఇదీ చదవండి :కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​కు కొవిడ్​ పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details